Friday, September 27, 2024
HomeతెలంగాణEmmiganuru: ఎమ్మెల్యేను కలిసిన 'లిల్లీ' హీరో రాజ్ వీర్

Emmiganuru: ఎమ్మెల్యేను కలిసిన ‘లిల్లీ’ హీరో రాజ్ వీర్

హీరోగా ఆదోని కుర్రాడు రాజ్ వీర్

కర్నూలు జిల్లా ఆదోని కు చెందిన రాజ్ వీర్ నటించిన లిల్లీ సినిమాను ఆదరించాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కోరారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని లిల్లీ సినిమా హీరో రాజ్ వీర్ తో యూనిట్ బృందం కలిశారు.

- Advertisement -

లిల్లీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి స్వగృహం లో లిల్లీ సినిమా హీరో రాజ్ వీర్ యూనిట్ సినిమా ట్రైలర్ పాటలు చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ లిల్లీ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుందని ఈ సోమవారం నుండి ఎమ్మిగనూరు శివ సినీ కాంప్లెక్స్ నందు వీక్షించవచ్చని తెలిపారు. అలాగే ఈ సినిమాలో ఆదోని కుర్రాడు రాజ్ వీర్ మంచి పాత్ర పోషించారని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని కోరారు. రాజ్ వీర్ కు ఎప్పుడు తమ సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వినయ్, బంగి శ్రీరాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News