Friday, September 20, 2024
HomeతెలంగాణErrabelli: విద్యుత్ బిల్లుల కొరకై సంవత్సరానికి 108 కోట్లు

Errabelli: విద్యుత్ బిల్లుల కొరకై సంవత్సరానికి 108 కోట్లు

విద్యుత్తు భారం ప్రజలపై మోపకూడదన్నది ఉద్దేశం

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో విద్యుత్ సబ్సిడీ క్రింద సంవత్సరానికి 108 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామంలో 1.99 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ పరిధి కింద ఉన్న పతేపూర్, బ్రాహ్మణ కొత్తపల్లి, పోలేపల్లి , మాడుపల్లి గ్రామాలలో లో వోల్టేజ్ ఇబ్బందులు తొలుగుతాయని మంత్రి చెప్పారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక సంవత్సరానికి విద్యుత్ బిల్లుల కింద 108 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు. ఒక్క పోలేపల్లి లోనే కోటి రూపాయలు బిల్లుల రూపంలో చెల్లిస్తున్నామన్నారు.

- Advertisement -

విద్యుత్తు భారం ప్రజలపై మోపకూడదన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు. అంతేకాకుండా ఇంటింటికి త్రాగునీరు అందివ్వాలని ఉద్దేశంతో 1.50 కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు అందిస్తున్నట్లు తెలియజేశారు. పోలేపల్లి నుండి మడుపల్లి వరకు 4.56 కోట్లతో రహదారి నిర్మిస్తున్నామని సెంట్రల్ లైటింగ్ కు మూడు కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.ఎస్సీ కాలనీలో ఐదు లక్షలతో కమ్యూనిటీ హాలు అదేవిధంగా రజకులకు ఐదు లక్షలు, ఖబరస్థాన్ కు మూడు లక్షలు, సాహెబ్ గుడికి మూడు లక్షలు కేటాయించామన్నారు.

రైతు బంధు కింద 5.50 కోట్లు ఖర్చు చేశామన్నారు. తాను కూడా రైతాంగం నుండి వచ్చిన వాడినేనని రైతుల గోస కళ్ళారా చూశాను అన్నారు. అందుకే ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో సబ్స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నరసింహారావు, జడ్పిటిసి మంగళ పెళ్లి శ్రీనివాస్,ఎంపిపి తూర్పాటి అంజయ్య, పిఎసిఎస్ చైర్మన్ కాకినాడ హరిప్రసాద్,గ్రామ సర్పంచ్ యాకయ్య, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి,కో ఆప్షన్ నెంబర్ ఎస్కే అంకుష్, రైతు సమన్వయ సమితి సభ్యులు కిషోర్ రెడ్డి,విద్యుత్ శాఖ అధికారి నరేష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News