సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో పలు చోట్ల ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల్లో జోష్ ని నింపారు. బతుకమ్మ ను ఎత్తుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు, పాలకుర్తి, దర్దే పల్లి, మల్లంపల్లి, వావిలాల, రేగు ల, అవుతపురం, నాంచారి మడూరు, తొర్రూరు, అమ్మపురం, గుర్తూరు, అన్నారం, పర్వతగిరి లో మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం ఆయా చోట్ల మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోలాటం కూడా ఆడారు. మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతూ వారితో మమేకమై మంత్రి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడటంతో అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ సందర్భంగా మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,ముఖ్యంగా ఆడ బిడ్డలకు సద్దుల బతుకమ్మ, దసరా – విజయదశమి శుభాకాంక్షలు! తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ అన్నారు. ప్రకృతిలో లో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు ఆ పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ అన్నారు. ప్రపంచంలోనే ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే వుంది. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మ గౌరవం ఈ బతుకమ్మ పండుగ. కల్వకుంట్ల కవిత గారి ద్వారానే బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించింది అన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి గా నిలిచింది బతుకమ్మ పండుగ. అందుకే సీఎం కెసీఆర్ గారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్ణయించి నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కేసీఅర్ గారు ఆడ బిడ్డలకు పండుగ కానుక గా బతుకమ్మ చీరలు ఇచ్చారు. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే పండుగలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు! అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.