Sunday, July 7, 2024
HomeతెలంగాణErrabelli Bday: మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు

Errabelli Bday: మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలు హైదరాబాదులోని మంత్రుల నివాసంలో ముందుగానే జరిగాయి. జులై 4వ తేదీన 67వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను ఉపాధి హామీ ఉద్యోగులు ఆదివారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో నిర్వహించారు. ఈ నెల మూడో తేదీన నే మంత్రి అమెరికాకు వెళుతున్నందున ఆరోజు అందుబాటులో ఉండని మంత్రి పుట్టిన రోజుని ఈజిఎస్ ఉద్యోగులు ముందుగానే నిర్వహించారు. మంత్రి దయాకర్ రావు చేత కేక్ కట్ చేయించి, పుష్పగుచ్చాలు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ఉపాధి హామీ ఉద్యోగుల పే స్కేల్ సవరింపు విషయమై మంత్రికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జేఏసీకి చెందిన పలువురు నేతలు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News