Friday, September 20, 2024
HomeతెలంగాణErrabelli: జమ్మి పూజలో మంత్రి ఎర్రబెల్లి

Errabelli: జమ్మి పూజలో మంత్రి ఎర్రబెల్లి

ప్రజల మధ్య దసరా ఉత్సవాలు

వరంగల్ జిల్లా పర్వత గిరి, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సామారం, తొర్రూరు, రాయపర్తి, మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు మంత్రి పూజలు చేశారు. జమ్మి ని స్వీకరించి పలువురికి పంచారు. పలువురు పెద్దలకు జమ్మి ఆకు ను పెట్టి అలాయి బలాయి తీసుకున్నారు. రావణా సుర వధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా వేర్వేరు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో మంత్రి వేర్వేరుగా మాట్లాడుతూ, రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గం, పర్వత గిరి, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయోత్సవం గా దసరా పండుగని జయకేతనం గా ప్రజలు జరుపుకుంటారని, ప్రజలు తల పెట్టుకున్న తమ తమ కార్యాల్లో విజయం సాధించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో చెడుపై మంచి విజయం సాధించి తీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News