Saturday, October 5, 2024
HomeతెలంగాణErrabelli: నన్ను గెలిపించిన మీ రుణం తీర్చుకుంటా

Errabelli: నన్ను గెలిపించిన మీ రుణం తీర్చుకుంటా

రాష్ట్రంలోనే మొదటి సారిగా పాలకుర్తి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఉచిత కుట్టు శిక్షణ, ఉపాధి, ఉద్యోగ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకున్న పాలకుర్తి మండలానికి చెందిన మహిళలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్టిఫికేట్లు, మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో శిక్షణ తీసుకున్న మహిళలతో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కలుస్తూ, వారితో ఫోటోలు దిగారు.  శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.  

- Advertisement -

5 కోట్ల 10 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని పాలకుర్తిలో ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.  మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వటం తన లక్ష్యమన్న ఎర్రబెల్లి, మొదటి విడతగా 3వేల మందికి శిక్షణ ఇవ్వటంలో భాగంగా ప్రస్తుతం వెయ్యి మందికి ట్రైనింగ్ పూర్తైనట్టు తెలిపారు. ఒక్కో గ్రామంలో 100 మంది మహిళలు శిక్షణ తీసుకోవాలని, శిక్షణ పూర్తి అయిన వాళ్లకు ఈ జూలై నుండి వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.  నియోజకవర్గంలో ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ఆయన ఇందుకు తాను సాయం చేస్తానన్నారు.  నన్ను గెలిపించిన మీ రుణం తీర్చుకుంటానని ఆయన ఎమోషనల్ గా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో drdo రామ్ రెడ్డి, apd నూరొద్దిన్, డీపీఎం లు, సీసీ లు, శిక్షణ ఇచ్చిన వారు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, శిక్షణ కు ఎంపికైన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News