Friday, November 22, 2024
HomeతెలంగాణErrabelli: 'ఆధ్యాత్మిక తెలంగాణ'గా మారుస్తున్న సీఎం

Errabelli: ‘ఆధ్యాత్మిక తెలంగాణ’గా మారుస్తున్న సీఎం

యాదాద్రి, వేముల‌వాడ‌, పాల‌కుర్తి, భ‌ద్ర‌కాళి, ఐలోని, కొముర‌వెల్లి, స‌న్నూరు, నాంచారి మ‌డూరు పునరుద్ధరణ

రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతున్నది. సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చింది. అన్ని మతాలు, కులాలకు సముచిత గౌరవం దక్కుతున్నది. ప్రభుత్వమే ప్రజలకు కానుకలు ఇచ్చి, పండుగలను చేసే సంస్కారం నెలకొంది. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ జరిగింది. అన్ని దేవాలయాలకు కనీస ధూప దీప నైవేద్యాలు లభిస్తున్నాయి. దేవాలయాల నిర్వహణకు కనీస నిధులు అందుతున్నాయి. పూజారులు, ఇమామ్ లు, మౌజమ్ లు, ఫాదర్ల కు వేతనాలు పెంచి ఇస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో యాదగిరి గుట్ట ను అభివృద్ధి చేశారు. పాలకుర్తిలో చారిత్రక, ఆధ్యాత్మిక, సాహిత్య, పర్యాటక పరివ్యాప్తం అయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఆశీస్సుల‌తో, పాల‌కుర్తి, బ‌మ్మెర‌, వ‌ల్మీడి కారిడార్ స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

- Advertisement -

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ విశేష పూజలు, ప్రార్థనలు, నామాజులు చేశారు. పాలకుర్తి లో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. కొడకండ్ల చర్చిలో ప్రార్థనలు చేశారు. తొర్రూరు మసీదులో, అన్నారం షరీఫ్ లో నమాజులు చేశారు. తొర్రూరు లో జయశంకర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. పర్వత గిరి మండలం కల్లెడ శ్రీ భైరవ సహిత ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠాపన కు భూమి పూజ ను స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కల్లెడ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు లతో కలిసి చేశారు. ఆయా చోట్ల వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News