Thursday, September 19, 2024
HomeతెలంగాణErrabelli: పక్కా ప్రణాళికలతోనే అభివృద్ధి

Errabelli: పక్కా ప్రణాళికలతోనే అభివృద్ధి

పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని అన్నిరంగాలలో అభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామాణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని టి.ఎస్.ఐ.ఆర్.డి. (రాష్ట్రా గ్రామాభివృద్ధి సంస్థ)లో జిల్లా పంచాయతీ అధికారులతో,
జిల్లా పరిషత్ సి. ఇ.ఓ.లు, డిఆర్ డిఓ లకు గ్రామీణభివృద్ధి కార్యక్రమాలపై 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి
ఆయన ప్రారంభించి మాట్లాడారు. పంచాయతి రాజ్ చట్టాలను సరికొత్తగా రూపొందించిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రణళికాబద్ధంగా విజయాలు సాధించాలన్నారు. చిన్న జిల్లాల ద్వారా అభివృద్ధి మరింత
సులభతరమైనందున సత్వరమే సమగ్రాభివృద్ధి సాధించవచ్చానని ఆయన సూచించారు. 50 శాతం గ్రామాలలో వైకుంఠ ధామాలను ఇంకా వినియోగించడం లేదని, నీటి సరఫరా, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించి సత్వరమే వినియోగంలోకి తేవాలన్నారు.
పల్లె పృకృతి వనాలను నిర్వహిస్తూ ప్రజలకు వినియోగoలోకి తేవాలని కోరారు. క్రీడా ప్రాంగణాలు నిర్మించి వదలివేయకుండా గ్రామీన యువతను సమన్వయ పరిచివినియోగంలోకి తేవాలని కోరారు. గ్రామ పంచాయితీలకు ఇచ్చిన ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్త సేకరించి వెర్మి కంపోస్టు తయారు చేసి విక్రయించి గ్రామపంచాతిలకు ఆదాయాని సమకూర్చుకోవాలని, అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర నిదులతో పంచాయతీ లు శాశ్వత ఆదాయం పొందే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు.
డంపింగ్ యార్డుల నిర్వహణ, నాటిన చెట్ల సంరక్షనకు చర్యలు తీసుకోవాలని, ఉపాది హామీ చట్టాన్ని సరియైన రీతిలో సద్వినియోగ పరచుకోవాలని కోరారు. ఉపాదిహామి చట్టం కింద కూలీలకు పనిదినాలు పెంచాలని, ఐ.కె.పి ల ద్వారా ధాన్యసేకరణ జరపాలన్నారు.
ఉపాదిహామ చట్టం పనుల విషయంలో 19 బృందాలు పరిశీలించి పనుల నాణ్యతను ప్రశంసించాయని, పనుల విషయంలో ఎలాంటి చిన్న రిమార్కు కూడా లేవనెత్తలేదన్నారు. 907 కోట్లు మెటీరియల్ కాంపోనెంటు నిధులు రావలసి ఉన్నట్లు మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

- Advertisement -

ఓరిమెంటేషన్ కార్య్యమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలోని
అన్ని గ్రామపంచాయతీలలో ఖాళీ స్థలాలు గుర్తించి ఆదాయం చేకూర్చే విధంగా వెదురు, టేకు, గoధం, తదితర చెట్ల పెంపకం చేపట్టి సంపద వనాలను సృష్టించాలని, తద్వారా గ్రీనరీ పెరగడంతో పాటు ఆదాయం పెంపొందించే దిశలో ప్రభుత్వం త్వరలో తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామంలోని యువతను భాగస్వాములను చేసి ప్లాస్టిగ్ వినియోగo నిర్మూలించాలని సర్పంచులకు, కార్యదర్శులకు సూచించారు. సాటిలైట్ ద్వారా పరిశీలించగా గ్రినరీ 7.7 శాతం పెరిగిందని రాబోయే 2 ఏళ్ళలో 10 శాతం
పెంచే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీకి ఏజెండాగా రూపొందిందని, ఈ కార్యక్రమం ఒక నూతన అద్యయం సృష్టించి తక్కువ కాలంలోనే ప్రగతి శీల గ్రామ పంచాయితీలు గా మారినట్లు ఆమె అన్నారు.

తెలంగాణ లో 13 పంచాయితీలు కేంద్ర అవార్డులు సాధించడం పట్ల ఆమె పంచాయతీ కార్యదర్శులను,
సర్పంచులను ఈ సందర్భంగా అభినందించారు. సామాజిక భద్రత, ఆరోగ్య, తాగునీరు సరఫరా
తదితర రంగాలలో అవార్డులు సాధించిన సర్పంచులతో వారి అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో పాల్గోన పంచాయతీ రాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా ఉద్యమ స్పూర్తితో గ్రామ పంచాయతీల అభివృద్ధి జరుగుతోందన్నారు. ఇందుకు నిదర్శనమే రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులని ఆయన అన్నారు.
అవార్డులు రావడం వల్ల పంచాయతీల బాధ్యత మరింత పెరిగిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర పక్రియ అని, ఇంకా సాధించాల్సిన అభివృద్ధి ఎంతో ఉన్నందున అధికారులు సమన్వయంతో
పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో కమీషనర్ హన్మంతరావు, స్పెషల్ కమిషనర్, డిక్యుటీ కమిషనర్లు, అవార్డ్లు పొందిన సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News