Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: ఘనంగా తెలంగాణ విద్యా దినోత్సవం

Errabelli: ఘనంగా తెలంగాణ విద్యా దినోత్సవం

పలు స్కూల్స్ , గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పలు స్కూల్స్ భవనాలను, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభిస్తూ, విద్యా దినోత్సవ వేడుకలలో పాల్గొంటున్నారు. జనగామ జిల్లా, స్టేషన్ ఘనపుర్ మండలం రంగరాయ గూడెంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ తాటికొండ రజయ్యతో కలిసి అంగన్వాడీ పాఠశాలను ప్రారంభించి, విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించి, విద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం పెద్ద బాయి తండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బాలుర రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించి, విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల హై స్కూల్ లో డిజిటల్ తరగతులు ప్రారంభించి, విద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు,ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News