Saturday, November 15, 2025
HomeతెలంగాణKavitha vs Mallanna: కవిత, మల్లన్న మధ్య మాటల యుద్ధం.. తెలంగాణ రాజకీయం తారాస్థాయికి!

Kavitha vs Mallanna: కవిత, మల్లన్న మధ్య మాటల యుద్ధం.. తెలంగాణ రాజకీయం తారాస్థాయికి!

Fight Between Mallanna And Kavitha: BRS ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రతి విశేషంలోనూ ఆమె చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. అయితే ఇటీవల బీసీ రిజర్వేషన్‌పై కవిత చేసిన కామెంట్లపై మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై కవితకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. అలాగే బీసీలతో కవితకు ఎలాంటి సంబంధం ఉందని.. వారికి కంచం పొత్తు ఉందా ? లేకా మంచం పొత్తు ఉందా అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి నేతలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. దీనిపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

- Advertisement -

“తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుంది. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన చేశారు. ఇంత మాత్రనికే గన్ ఫైర్ చేసి పేస్తారా? ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా? నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి? లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి… మీరు ఎథిక్స్ కమిటీకి పిర్యాదు చేయాలని మండలి ఛైర్మన్ సూచించారు. తీన్మార్ మల్లన్న జాగ్రత్త. వెంటనే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. నాపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ ? సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్న.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు…నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు?” అని మండి పడ్డారు.

అటు కవిత వ్యాఖ్యలపై తీన్మార్ మల్లన్న సైతం తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆయన వ్యాఖ్యానిస్తూ.. “కంచం పొత్తు మంచం పొత్తు అనేది తెలంగాణ సామెత. ఆ మాట అంటే బూతు కాదు. అది తప్పు పదం కాదు. తెలంగాణలో కురుమ మరియు యాదవ్‌ల విషయంలో ఈ సామెతను వాడుతారు. కురుమలకు, యాదవులు చేసే వృత్తి ఒకటే గొర్రెల పెంపకం. కురుమలకు, యాదవులకు కంచం పొత్తు ఉంటుంది కానీ మంచం పొత్తు ఉండదు అని వాడుతారు. కంచం పొత్తు అనగా తింటూ కలసి ఉండటం కలసి పని చేయడం. మంచం పొత్తు అనగా వియ్యం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అలాంటివి ఉండదు అనే సందర్భంలో వాడతారు. అది బూతు కాదు. అది అర్థం కాని వాళ్ళను ఏమి చేయలేము” అని వ్యాఖ్యానించారు. ఏది అయినప్పట్టికీ మల్లన్న వ్యాఖ్యలు తెలంగాణలో సరికొత్త రాజకీయ అలజడికి కారణమయ్యాయని చెప్పొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad