Sunday, December 22, 2024
HomeతెలంగాణFit India in Hyderabad: హైదరాబాద్ లో ఫిట్ ఇండియా సైక్లింగ్ రైడ్‌

Fit India in Hyderabad: హైదరాబాద్ లో ఫిట్ ఇండియా సైక్లింగ్ రైడ్‌

ఫిట్ గా ఉందాం..

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్, డాక్టర్ మాక్స్‌వెల్ ట్రెవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో కలిసి 22 డిసెంబర్ 2024న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్.ఎ.టి.జి. సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో ఫిట్ ఇండియా సైక్లింగ్ రైడ్‌ను నిర్వహించింది. ఈ రైడ్‌ను నిషా విద్యార్ధి అసిస్ట్‌ సమన్వయం చేశారు. డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్, డా. మాక్స్‌వెల్ ట్రెవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఫిట్ ఇండియా ఉద్యమం సంయుక్తంగా సైకిళ్ల వినియోగంపై అవగాహన, ప్రాముఖ్యతను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ గా ఇది దేశవ్యాప్తంగా సాగుతూ ఒకరిని ఫిట్‌గా చేయడమే కాకుండా వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడేలా చేస్తున్నాయి. ఇంధనం కాకుండా మనమందరం కొవ్వును కరిగిద్దామంటూ సందేశాన్నిస్తూ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News