తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు(MLC Results) ఏకగ్రీవం అయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ అభ్యర్థి సత్యం.. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేశారు.
వీరితో పాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల పత్రాలు సరిగా లేని కారణంగా తిరస్కరించబడ్డాయి. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కగా.. వాటిలో ఒకటి మిత్ర పక్షమైన సీపీఐకి కేటాయించింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓ స్థానం దక్కింది.