Monday, November 17, 2025
HomeఆటJitender Reddy: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి విజయం

Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి విజయం

Telangana Olympic Association: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్ఢి(Jit‌hender Reddy) ఘన విజయం సాధించారు. అధ్యక్షుడి స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌(Chamundeshwarnath)పై జితేందర్ గెలుపొందారు. ఈ పదవికి వీరిద్దరూ మాత్రమే నామినేషన్ వేశారు. అయితే ఉపాధ్యక్ష స్థానానికి కూడా చాముండేశ్వర్‌నాథ్‌ నామినేషన్ వేయడం గమనార్హం. ఇక ప్రధాన కార్యదర్శి పదవికి మల్లారెడ్డి, బాబురావు, ప్రదీప్ కుమార్ నామినేషన్లు వేశారు.

- Advertisement -

ఈ ఎన్నికలలో ⁠⁠జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండేశ్వర్ నాథ్‌కు కేవలం 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జితేందర్ రెడ్డి 34 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు. కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికలో మల్లారెడ్డికి 40 ఓట్లు రాగా, బాబురావుకు 12 ఓట్లు నమోదయ్యాయి. దీంతో మల్లారెడ్డి 28 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad