కరీంనగర్ సిటీ గులాబీమయమైంది. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ సందర్భంగా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తాయి కరీంనగర్ వాడలు. చిన్నా, పెద్ద, పిల్లా, పాప, అవ్వ, అయ్యా స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ర్యాలీలో పాల్గొన్నారు కరీంనగర్ ప్రజలు. గుర్తును గుర్తుంచుకో, కారును గుర్తుంచుకో… అన్న గంగులను గుర్తుంచుకో.. అంటూ పాటలు పాడి స్టెప్పులు వేసిన అభిమానులు చేసిన సందడి తారాస్థాయికి చేరింది.
- Advertisement -
అభిమానులతో పదం, పాదం కలిపి హుషారెత్తించారు మంత్రి గంగుల. స్వచ్చందంగా తరలిన కిలోమీటర్ల మేర ప్రజా ర్యాలీతో గంగుల భారీ విజయం ఖాయమనేలా ఓ దశలో పరిస్థితి కనిపించింది.