తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలప్రజలు సంతోషంగా ఉండాలని.. కుల వృత్తులకు జీవం పోసింది కేసీఆర్ సర్కారే నాని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు. రాంనగర్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు.. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ముదిరాజ్ కులస్తుల విజ్ఞప్తి మేరకు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.. తమ విజ్ఞప్తి మేరకు నిదుర మందులు చేసిన గంగుల కమలాకర్ ని ముదిరాజ్ కులస్తులు శాలువా కప్పి భారీ గజమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వ నిధులతో పాటు హైదరాబాద్ నడి బొడ్డులో ఖరీదైన స్థలాలు మంజూరు చేసిందని గుర్తు చేశారు… కరీంనగర్ రామ్ నగర్ లోని ముదిరాజ్ కులస్తుల ఆత్మగౌరవ భవనానికి 30 లక్షల నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు… అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.. గత పాలకుల నిర్లక్ష్యంతో కరీంనగర్ అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు.. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు అస్తవ్యస్తంగా మురికి కాలువలుండేవన్నారు.
9 ఏండ్ల తెలంగాణ పాలనలో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు.. కరీంనగర్ లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని .. నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని గుర్తు చేశారు.. కరీంనగర్ లో తీగల వంతెన ,మానేర్ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులతో పూర్తయితే .. కరీంనగర్ కు పర్యాటక శోభ సంతరించుకుంటుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ బారాస నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు పెంట సత్యం వరాల నారాయణ , నాయకులు కొట్టే మల్లేశం పలువురు ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.