Tuesday, September 17, 2024
HomeతెలంగాణGangula: కరీం'నగరాన్ని' అభివృద్ధి చేసి భావితరానికి అందిస్తాం

Gangula: కరీం’నగరాన్ని’ అభివృద్ధి చేసి భావితరానికి అందిస్తాం

కరీం’నగరాన్ని’ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భావితరానికి అందిస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా నగరంలోని 17వ డివిజన్ శ్రీరాంనగర్ కాలనీ, కురుమవాడలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 50 లక్షలతో సాధారణ నిధులతో రెండు చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. పనులను త్వరగా చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల 75 సంవత్సరాల పాలనలో కుంటుపడ్డ అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 సంవత్సరాల్లోనే నగర రూపు రేఖలు పూర్తిగా మారాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన వందల కోట్ల రూపాయల నిధులతో నగరం అభివృద్ధి బాట పట్టిందన్నారు. ప్రతి డివిజన్ లో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా సాగుతున్నాయన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News