Saturday, October 5, 2024
HomeతెలంగాణGarla: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Garla: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పూల పూజ..

కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో నిత్యం రోగుల ఆర్తనాదాలతో దద్దరిల్లే ఆస్పత్రి నేడు బతుకమ్మ పాటలు కోలాటాలతో కళకళలాడింది. నిత్యం రోగులకు చికిత్స చేస్తూ మందులతో కుస్తీపడే వైద్య సిబ్బంది నేడు సరదాగా బతుకమ్మ ఆడారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం ఆవరణంలో శనివారం వైద్య సిబ్బంది బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించి సంబరాలు జరిపారు.

- Advertisement -

తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలాడుతూ పోరాటాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ హెడ్ నర్స్ స్వాతి మాట్లాడుతూ ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగని, తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు ఉన్న ఆశ్వీయుజ మాసంలో బతుకమ్మ పండుగను నిర్వహించడం తెలంగాణకు గర్వకారణమన్నారు.

ఈ కార్యక్రమంలో ఫార్మా సిస్టర్ జ్యోతి రమా సబిత సరిత పుష్పలత శాంత సరోజ శానిటేషన్ సిబ్బంది సింధు ఉమ కళ చిన్ని హేమలత తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News