Sunday, October 6, 2024
HomeతెలంగాణGarla: టెన్త్ ఫలితాల్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

Garla: టెన్త్ ఫలితాల్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

వెల్లువెత్తిన అభినందనలు

పది పబ్లిక్ వార్షిక పరీక్షల్లో మండల స్థాయిలో నిర్మల్ స్కూల్ పాఠశాల విద్యార్థిని తమన్నా జైన్ జిపిఏ 9.8/10 తో ప్రథమ స్థానంలో నిలిచింది. బోర్డు ప్రకటించిన పది ఫలితాలలో మండల స్థాయి ద్వితీయ శ్రేణిలో.. ఇద్దరు 1,విశ్వశాంతి పాఠశాల విద్యార్థిని ఉయ్యాల హర్షిత జిపిఏ 9.7/20, 2, నిర్మల స్కూల్ విద్యార్థిని బి.వినీల జిపిఏ 9.7/10 తో సెకండ్ స్థాయిలో నిలిచారు. మండల స్థాయి తృతీయ స్థానంలో… విశ్వశాంతి పాఠశాల స్టూడెంట్ పంజాల శివ మహర్షి జిపిఏ 9.5/10 తో థర్డ్ స్థాయిలో నిలిచారు. మండల పరిధిలో నాలుగు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాశారు. నిర్మల్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణత 51/51, విశ్వశాంతి పాఠశాల ఉత్తీర్ణత 24/24, సమత పాఠశాల 16/17, 94% ఉత్తీర్ణత సాధించగా, బంజారా సేవా సమితి 6/6 నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. నాలుగు ప్రైవేటు పాఠశాలల మొత్తం పది విద్యార్థులు 98 గాను 97 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News