Saturday, September 28, 2024
HomeతెలంగాణGarla: బహిరంగ వేలం పాట

Garla: బహిరంగ వేలం పాట

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో టెంటు సామాగ్రి కిరాయి 25000 కిరాణం కూల్ డ్రింక్స్ 10000 అమ్ముకునే హక్కులకు సంబంధించి గాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిం చనున్నట్టు ఆలయ ఈవో నందనం కవిత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేలం పాటలు దేవస్థానం కార్యనిర్వాక దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరుపబడునని వేలం పాటలో పాల్గొన దలచిన వారు నిర్వహించిన డిపాజిట్ ముందుగా చెల్లించాలని వేలంపాట పూర్తికాగానే హెచ్చు పాటదారుడు పాడిన సొమ్ములో డిపాజిట్ కాకుండా పూర్తి సొమ్ములో సగం వెంటనే చెల్లించాలని మిగిలిన సొమ్ము ఏడు రోజుల వ్యవధిలో చెల్లించాలన్నారు. హెచ్చుపాటదారుడు పూర్తి సొమ్ము గడువులోగా చెల్లించని కాలంలో హెచ్చు పాటదారుడి డిపాజిట్ జప్తు చేసి తిరిగి వేలంపాట నిర్వహించబడునని, వేలం పాటలో పాల్గొన్నదలచినవారు ముందుగానే డిపాజిట్ చెల్లించాలని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News