Friday, April 4, 2025
HomeతెలంగాణGarla: ఇంజినీర్ కు ఉత్తమ వార్షిక అవార్డు

Garla: ఇంజినీర్ కు ఉత్తమ వార్షిక అవార్డు

బెస్ట్ ఇంజినీర్ ఆఫ్ ద ఇయర్..

గార్ల మండల పరిధిలోని రాంపురం గ్రామానికి చెందిన గొళి రాఘవేంద్ర రావుకు ప్రతిష్టాత్మకమైన ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ -2024 అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత ఇంజనీర్ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ‘ఇంజినీర్ ఆఫ్ ది’ అవార్డు ప్రదానం చెయ్యడం ఆనవాయితీ.

- Advertisement -

ఈ ఏడాది హైదరాబాద్ బి హెచ్ ఈ ఎల్ లో అడిషనల్ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న రాఘవేంద్ర రావు ఎంపిక కావడంతో హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. గార్ల మండలం పరిధిలోని మారుమూల గ్రామమైన రాంపురంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్న రాఘవేంద్ర రావును గార్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు, స్థానిక ప్రముఖులు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News