Monday, September 16, 2024
HomeతెలంగాణGarla: మెరుగైన వైద్య సేవలు అందించాలి

Garla: మెరుగైన వైద్య సేవలు అందించాలి

డి సి హెచ్ ఎస్ వెంకట్రాములు

వివిధ సమస్యలతో ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు వెంటనే మెరుగైన చికిత్స అందించే విధంగా డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండాలని, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ వెంకట్రాములు వైద్య సిబ్బందిని ఆదేశించారు.
గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను సునిషితంగా పరిశీలించి రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న వైద్య సేవలను అందుతున్న, సదుపాయాల, గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సంఖ్య మరింత పెరిగేలా, చూడాలన్నారు. డెంగ్యూ మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా హై రిస్క్ ఉన్న కేసులను గుర్తించి, మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు రిఫర్ చేయాలన్నారు.

- Advertisement -

రోగులకు ఎలాంటి, ఇబ్బంది కలగకుండా, మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది 13 మందికి గత తొమ్మిది నెలల నుంచి వేతనాలు రావడం లేదని వాటిని మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ హనుమంతరావు, వైద్య సిబ్బంది, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News