Monday, November 17, 2025
HomeతెలంగాణGarla: రక్తదానం చేసిన సోషల్ మీడియా కన్వీనర్

Garla: రక్తదానం చేసిన సోషల్ మీడియా కన్వీనర్

గార్ల మండల పరిధిలో స్థానిక పినిరెడ్డిగూడెం గ్రామ రెడ్ స్టార్ యూత్ ఏర్పాటు చేసిన రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అత్యవసర సమయంలో ఖమ్మం జిల్లా మమత హాస్పిటల్ లో పేషంట్ ఆరెంపుల మమతకు బ్లడ్ పర్సెంట్ 3% ఉండడంతో మానవ దృక్పథంతో రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సోషల్ మీడియా కన్వీనర్ వంగూరి రణధీర్ వ్యక్తిగతంగా 8వ సారి సామాజిక బాధ్యతగా రక్త దానం చేసి తన మానవత్వం చాటుకున్నారు. రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ యూత్ మూడు సంవత్సరాలుగా రక్త దాన కార్యక్రమాలు చేపడుతూ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పటివరకు 643వ రక్త దాన సేవా కార్యక్రమాలు చేస్తూ రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కమిటీ సభ్యులు ఎంతోమందికి ఆదర్శంగా నిలస్తున్నారు.ఈ క్రమంలో రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ కమిటీ సభ్యులు, రెడ్ స్టార్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కన్వీనర్ చింత కొండల్ రావు, కో కన్వీనర్ వంగూరి ప్రణయ్ కృష్ణ వంగూరి రణధీర్ కు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad