Sunday, November 16, 2025
HomeతెలంగాణGarla: ఎమ్మెల్యే కనకయ్యను కలిసిన కాంగ్రెస్ శ్రేణులు

Garla: ఎమ్మెల్యే కనకయ్యను కలిసిన కాంగ్రెస్ శ్రేణులు

మర్యాదపూర్వకంగా కలిసిన..

కొత్తగూడెం జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్యను గార్ల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్లు పిఎసిఎస్ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం విద్యార్థులు ఉద్యమకారులు అనేకమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న క్రమంలో చలించిన సోనియా గాంధీ వెంటనే తెలంగాణను ప్రకటించిన రుణం తీర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని.. అందులో భాగంగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యను పార్టీ కార్యకర్తలు ప్రజలు యువకులు మేధావులు ఉద్యమకారులు నిరుద్యోగులు ఏకధాటిపై నిలిచి అధిక మెజార్టీతో గెలిపించుకున్నామన్నారు. కోరం కనకయ్య గెలుపుతో నియోజకవర్గం మొత్తం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ వెంకట్ లాల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకటరెడ్డి హతిరాం నాయక్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad