Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: ఆస్పత్రిని పీడిస్తున్న సిబ్బంది కొరత

Garla: ఆస్పత్రిని పీడిస్తున్న సిబ్బంది కొరత

పేదోడి వైద్యానికి భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఇంకా అందని ద్రాక్ష గానే ఉంది. గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో 10 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే సేవలు అందిస్తున్నారు. అకాల వర్షాల ప్రభావంతో చిన్న కృష్టాపురం మర్రిగూడెం రాంపురం పెద్ద కిష్టాపురం ముత్తి తండా పూమ్య తండా పిన్ రెడ్డి గూడెం శేరిపురం నగరం బాలాజీ తండా గ్రామాల్లో సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు ఇతర వ్యాధులు ప్రబలి, ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగుల తాకిడి నిత్యం పెరుగుతోంది. ఒకవైపు అనేక వైరస్ లు బయటపడుతుండటంతో ప్రజలు భయందోళనతో వైద్యం పొందేందుకు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు.

- Advertisement -

ఇక్కడి సీహెచ్ సీలో సిబ్బంది కొరతతో ఒక్కరే వైద్యాధికారి ఉండటంతో ఒక్కరిపై అదనపు భారం పడుతున్నా, రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. 30 పడకలకు విస్తరించిన కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంపై ఉన్నతాధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఆవరించడంతో ఇక్కడికి వైద్యులు వచ్చినట్లే వచ్చి ట్రాన్స్ఫర్ లపై వెళ్ళిపోతున్నారు. పదిమంది వైద్యులు ఉన్న ఆస్పత్రిలో 9 మంది వెళ్లిపోగా ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరితోనే 30 పడకల దవాఖానాను కొనసాగించాల్సి వస్తోంది. మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు ఇతరత్రా వైద్య సేవలు అందకపోవడంతో ఉన్న ఒక్క సాధారణ డాక్టర్ వద్దకు వైద్య సేవలు పొందేందుకు వెళ్లడంతో రోగుల సంఖ్య పెరుగుతూ తోపులాటకు దారితీస్తుంది.

పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న సర్కారు దవాఖానను 30 పడకలకు విస్తరించి, అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా వైద్యులు లేక వైద్య సేవకే దిక్కు లేకుండా పోతుంది. ఆస్పత్రి ప్రారంభంలో పది మంది వరకు వైద్యులు ఉండగా క్రమంగా ఆసుపత్రి నుండి ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం గమనాహర్హం. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆయా ప్రత్యేకతలు కలిగిన వైద్యులు ఇతరత్రా నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో సేవలందించే అవకాశం లేకపోగా ఉన్న ఒక్క డాక్టర్ కొద్ది మందే సిబ్బంది రాత్రి పగలు అందుబాటులో ఉంటున్నారు. సరైన సేవలు అందని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటుకు తరలిపోతున్నారు. అత్యవసర సేవలు సరిగా అందడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మండల పరిధిలోని గ్రామాల వాసులు వైద్య సేవల కోసం సిహెచ్ సి లోకి నిత్యం 300 వరకూ అవుట్ పేషంట్ల సంఖ్య ఓపి ఉంటుంది. వందలోపు ఇన్ పేషెంట్ల సంఖ్య ఉంటుంది. నెలకు అనేక ప్రసవాలు, శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ 30 పడకల ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ ఆర్తోపెడిక్ జనరల్ సర్జన్ ఆఫ్తాల్ ఈఎన్ టీ గైనకాలజిస్ట్ చెస్ట్ ఫిజీషియన్ డెంటల్ మత్తు చిన్నపిల్లల మహిళ వైద్యుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇతర డాక్టర్లు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News