పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మండల ప్రజలు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీలు ఇతర సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ప్రయాణికులు ఎటువంటి ఆధారాలు లేకుండా 50 వేలకు మించి తీసుకెళ్తే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.