ఫైలేరియా బోదకాలును వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించడమే మన లక్ష్యమని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి సుధీర్ రెడ్డి అన్నారు. గార్ల మండల పరిధిలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బోదకాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. బోదకాల వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10 తారీకు నుండి 12 వరకు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో మూడు రోజుల వరకు 69 బూతులను ఏర్పాటు చేశామని 13 నుండి 22వ తారీకు వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాత్రలను పంపిణీ చేయాలని 23 నుండి 25వ తారీకు వరకు బోదకాల వ్యాధి నిర్మూలించేందుకు కలిసికట్టుగా ఉద్యమించి, సామూహిక ఔషధ సేవనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ప్రబలే అవకాశం ఉందని, ముందస్తు చర్యలో భాగంగా ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాలను పక్కాగా జరిపి, దోమల వ్యాప్తిని అరికట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తం సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ సి హెచ్ ఓ సక్కుబాయి శ్రీహరి సూపర్వైజర్ ఇస్మాయిల్ బేగ్ వెంకటేశ్వరరావు విజయలక్ష్మి ఎమ్ ఎల్ హెచ్ పి ఎస్ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.