టపాసులు విక్రయించే వారు నిబంధనలను తప్పకుండా పాటించాలని గార్ల బయ్యారం సిఐ రవికుమార్ ఎస్సై జీనత్ కుమార్ లు అన్నారు. గార్ల మండల కేంద్రంలో మాట్లాడుతూ
ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రమాదాలు జరగకుండా కనీస జాగ్రత్తలు వహిస్తూ దీపావళి పండుగ నిర్వహించుకోవాలని, టపాసుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసేవారు ప్రజలు సంచరించని ప్రాంతాలలో స్థల యజమాని గ్రామపంచాయతీ ద్వారా అనుమతి పొంది ట్రాఫిక్ అంతరాయం లేని సరైన స్థలాన్ని పోలీస్ అధికారులు పరిశీలించిన పిదప తాత్కాలిక అనుమతుల కొరకు ఆర్డిఓ నుండి వచ్చిన అనుమతితో టపాసుల అమ్మకాలు జరపాలని సూచించారు.
టపాసు దుకాణ యజమానులు నాణ్యమైన టపాసులను విక్రయించాలని, టపాసుల విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాదాల నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని, ఎవరైనా లైసెన్స్ లేకుండా నిబంధనలు పాటించకుండా షాపులను ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణ కాలుష్యాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కని నాటాలని సూచించారు.