Friday, April 4, 2025
HomeతెలంగాణGarla-స్నేహితుడి కుటుంబానికి చేయూత

Garla-స్నేహితుడి కుటుంబానికి చేయూత

స్నేహమంటే ఇదేరా..

కులమతాలకు అతీతంగా రంగు, రూపం ధనిక పేద తేడాలు లేని పవిత్ర బంధమే స్నేహబంధం ఖమ్మంలో ఇటీవల భారీ వర్షం కురవడంతో వరదలకు సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుని కుటుంబానికి తోటి స్నేహితులు చేయూత నందించి అండగా నిలిచారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక పుట్టకోట బజారుకు చెందిన నరసింహారావు ఖమ్మంలో నివసిస్తున్నాడు. ఇటీవల మున్నేరు వరదలకు సర్వస్వం కోల్పోయాడు. తమతో పాటు కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు కుటుంబం కష్టాల కడలిలో ఉండటాన్ని చూసి చలించిపోయిన 87-88 ఎస్ ఎస్ సి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ఆపదలో మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహితుడి కుటుంబానికి తమ వంతుగా 13 వేల రూపాయల నిత్యావసర సరుకులు కుర్చీలు ప్లాస్టిక్ వస్తువులు పదివేల రూపాయలు తోచిన రీతిలో ఆర్థిక సహాయాన్ని అందించి నేస్తం అన్న మాటకు సరైన నిర్వచనం తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో శేఖర్ సాంబ హనుమంతు వడ్లమూడి నాగ గంజి రవిశంకర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News