అంగన్వాడి స్కూల్లో ప్రైవేట్ స్కూళ్లకి దీటుగా విద్యను బోధిస్తున్నట్టు సూపర్వైజర్ గోపమ్మ అన్నారు. గార్ల మండల పరిధిలోని పుల్లూరు గ్రామ పంచాయతీ అంగన్వాడి సెంటర్ లలో ఫ్రీ స్కూల్ మేళాలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూపర్వైజర్ గోపమ్మ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల ద్వారా అందిస్తున్న పోషకాహారం బాలింతలకు చిన్న పిల్లలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు.
పిల్లల ఎదుగుదల గురించి తల్లులకు తగిన సూచనలు చేశారు. అంగన్వాడి స్కూల్ లో నేర్చుకున్న విషయాలు పిల్లలు ఆట పాటలతో పూర్వ ప్రాథమిక విద్యను వారి తల్లుల ఎదుట ప్రదర్శనలు నిర్వహించారు. అంగన్వాడి కేంద్రంలో చదివిన ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల గల పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు. ఇకపై వీరు ప్రైమరీ స్కూల్ కు వెళ్లేందుకు అర్హులని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఉపేంద్రమ్మ సునీత పార్వతి విక్టోరియా ఎమ్మెల్యా ఝాన్సీ నీల పిల్లలు తల్లులు బాలింతలు తదితరులు ఉన్నారు.
Garla: అంగన్వాడిలో ఫ్రీ స్కూల్ మేళా
ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్