దైవ కుమారుడు, కరుణామయుడు ఏసు క్రీస్తు మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి ఈ లోకంలో జన్మించి శిలువలో రక్తం చిందించి ప్రాణాలు అర్పించారని, రెవ. ఫాదర్ దిలీప్ కుమార్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఆర్ సి ఎం చర్చ్ దైవజనులు దిలీప్ కుమార్ సంఘస్తుల ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసిన రోజు కావడంతో త్యాగానికి ప్రతీకగా శుభ శుక్రవారం తొలుత ఉదయాన్నే క్రైస్తవులు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిశ్రద్ధలతో చర్చ్ లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని శిలువ వేయబడిన ఏసుక్రీస్తును ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ 14 ఘట్టాలను దేవునిని ఘనంగా ఆరాధిస్తూ శిలువ యాగం చేపట్టి గార్ల పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టి ఏసుక్రీస్తు కొరకు అతి గొప్పగా ప్రార్థనలు చేస్తూ ప్రభువును బంధించడం నుంచి శిలువ వేసే వరకు సంబంధించిన వివిధ కళారూపా ఘట్టాలను ప్రదర్శిస్తూ యేసయ్య భక్తి గీతాలు ఆలపిస్తూ 100మంది విస్వాసులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బాల భవన్ వద్ద ఏర్పాటుచేసిన ఏసుక్రీస్తు శిలువను భక్తులు తాకి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దైవజనులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు అనుసరించిన శాంతి మార్గం సిలువలో పలికిన ఏడు మాటలను సందేశం ఇచ్చారు. సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన శిలువపై ప్రాణాలు అర్పించారని గుడ్ ఫ్రైడే ద్వారా ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటల ద్వారా క్షమాగుణం, బాధ్యత, ప్రేమ, పాపపు ఒప్పుకోలు, దయా గుణాలను అలవర్చుకోవాలన్నారు. పాపపు జీవితాన్ని వదిలి క్రీస్తు చూపిన మార్గంలో నడిచి పరలోకం చేరాలని బోధించారు.
ఈ కార్యక్రమంలో సహాయక గురువులు ఫాదర్ కిరణ్ జోసెఫ్ సిస్టర్ షాలిట్ జైస్ అంజలి బాలస్వామి రమేష్ కిరణ్ ప్రేమ్ కుమార్ నరేష్ బాలు రానా సచిన్ శశిరేఖ నిర్మల రోస్మిన్ జెర్లిన్ బ్రదర్ టికెన్ లారెన్స్ ఆకారపు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.