Friday, April 4, 2025
HomeతెలంగాణGarla: వసతి గృహాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

Garla: వసతి గృహాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ..

వసతి గృహాల వార్డెన్ లు విద్యార్థులు ఆరోగ్యం ఆహారం చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ బాలికల బీసీ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను వంటగదిని పరిశీలించారు. హాస్టల్లోని మరుగుదొడ్లను ప్రత్యేకంగా పరిశీలించి పరిశుభ్రతపై సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు.

- Advertisement -

వార్డెన్ లు నిత్యం పిల్లలకు అందుబాటులో ఉండాలని విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట తాసిల్దార్ కే రవీందర్ ఎంపీడీవో మంగమ్మ ఆర్ ఐ రామకృష్ణ కార్యదర్శి కిషన్ నాయక్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News