గార్ల మండల పరిధిలోని మద్దివంచ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు మసీదు ఆవరణంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకట్ రెడ్డిలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు సోదరభావంతో మెలగాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆడెపు వెంకటేశ్వర్లు, హతిరామ్, బీరవెల్లి సంజీవరెడ్డి, యాకుబ్ పాషా మజీద్ కమిటీ సభ్యులు నయీమ్, ఎనుస్, అజిత్, మైబెలి, రషీద్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాబురావు, తిరుమలరావు, ఆంజనేయులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.