Monday, June 24, 2024
HomeతెలంగాణGarla: తీన్మార్ మల్లన్న గెలుపుకు కృషి చేయాలి

Garla: తీన్మార్ మల్లన్న గెలుపుకు కృషి చేయాలి

ప్రశ్నించే గొంతుకలు చట్టసభల్లో ఉంటేనే..

తీన్మార్ మల్లన్న గెలుపుకు కృషి చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ గార్ల మండల కేంద్రంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . జర్నలిస్టు వృత్తిని ఆయుధంగా మలుచుకొని పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండ కడుతున్న మల్లన్న లాంటి ప్రశ్నించే గొంతుకలు చట్టసభల్లో ఉంటేనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని, తీన్మార్ మల్లన్న చట్టసభకు పంపించాల్సిన బాధ్యత పట్టబద్రులదేనని అన్నారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ పదేళ్లు పరిపాలించిన దొందు దొందేనని రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం కోటి ఉద్యోగాలను తొలగించి ఉద్యోగస్తులను రోడ్డు పాలు చేసిందని, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్లలో లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని విమర్శించారు. ఈనెల 27న జరిగే ఉప ఎన్నికల్లో పట్టపద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీన్మార్ మల్లన్నను ఆదరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ప్రజలను చైతన్య పరుస్తు అవినీతి తిమంగలాలను తన మీడియా ద్వారా ఎండగట్టే మల్లన్నకు గ్రాడ్యుయేట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గేలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణ, సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు గుండా వెంకటరెడ్డి, ఎంపీపీ బట్టు నాగరాజు, జడ్పిటిసి ఝాన్సీ, మండల సిపిఎం నాయకులు కందునూరి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ నాయకులు మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News