శాంతి సహనం సమ్యక్ జ్ఞానం మానవాళికి బోధించిన మహావీరుని జీవిత సందేశం అందరికీ ఆదర్శమని విమల్ కుమార్ జైన్ అన్నారు. జైనుల 24వ తీర్థం కరుడు మహావీర్ 2552 జయంతిని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలో జైనుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత జైనులు జైన మందిరంలో మహావీర్ భగవాన్ కు భక్తిశ్రద్ధలతో ధార్మిక పూజలు నిర్వహించి, మహావీర్ ని ప్రార్థించారు. అనంతరం ఏకరూప దుస్తులు ధరించిన జైనులు జైన మందిరం ఆలయం నుండి గార్ల పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ, మహావీర్ భగవాన్ బోధనలైన జియో ఔర్ జీనేదో, అహింస పరమో ధర్మ, శాఖాహార్ సుఖ్ జీవన్ బితావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ శోభ యాత్ర నిర్వహించారు.
ఏకరూప దుస్తులతో మహావీరుని తత్వ సిద్ధాంతాలు శాంతి సందేహాలతో కూడిన గీతాలను ఆలపిస్తూ నిర్వహించిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి సమాజంలో తాను జీవించి ఇతరులను జీవించడానికి అవకాశం కల్పించాలనేది మహావీరుని బోధనలలో ప్రధానమైందన్నారు. ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో ప్రయోజనం అన్నారు.
ఈ కార్యక్రమంలో మహావీర్ జైన్ ఆకాష్ కుమార్ జైన్ చాంద్ మాల్ జైన్ విజయ్ కుమార్ మహేందర్ వినోద్ విమల్ కుమార్ అజయ్ ప్రవీణ్ విపుల్ విశాల్ ఆగం జైన్ ఆనంద్ గోపాల్ పథం శోభ పుష్ప జైన్ లు పాల్గొన్నారు.