ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో మండల కేంద్రానికి చెందిన సుతారి మేస్త్రి యూసఫ్ జాని కుమారుడు ఎస్ కె హఫిజ్ ఇంటర్ ప్రధమ సంవత్సరం ఎంపిసి గ్రూప్ లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించగా గార్ల మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్ లో సుతారి మేస్త్రిలు హఫిజ్ ను శాలువతో ఘనంగా సన్మానించారు. స్థానిక సమతా హైస్కూల్ లో పదవ తరగతి చదివిన హఫిజ్ 9.0 గ్రేడ్ ను సాధించారు. ఇల్లందు మైనారిటీ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న హఫిజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి పలువురు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని, ఇదే పట్టదలతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నతమైన ఉద్యోగం సాధించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్ది హఫిజ్ కు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. సన్మానం చేసిన వారిలో సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్, వెంకన్న మేస్త్రి, జడ శ్రీను మేస్త్రి, రవీందర్ మేస్త్రి, కాగిత ఎల్లయ్య, బడుగుల వెంకన్న, సత్య మేస్త్రి,ఎస్.కె మౌలానా, వీరయ్య మేస్త్రి, నాగరాజు, శ్రీను, యు టి ఎఫ్ మండల అధ్యక్షులు మాచర్ల సుందర్ కుమార్,జిల్లా నాయకులు జి. భధ్రు నాయక్, సుతారి కూలీలు తదితరులు ఉన్నారు.