Friday, May 10, 2024
HomeతెలంగాణGarla: మాలోత్ కవిత గెలుపుకు విస్తృతంగా కృషి చేయాలి

Garla: మాలోత్ కవిత గెలుపుకు విస్తృతంగా కృషి చేయాలి

పార్టీ ముఖ్యకార్యకర్తల భేటీలో..

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త విస్తృతంగా కృషి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మహబూబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపుకు కృషి చేయాలని, మే ఫస్ట్ న మహబూబాద్ జిల్లా కేంద్రంలో మాలోత్ కవిత గెలుపును కాంక్షిస్తూ రోడ్ షో కి విచ్చేస్తున్న కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి లింగాల ఉమేష్ , టౌన్ ప్రెసిడెంట్ గాజుల గణేష్ రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు పానుగంటి రాధాకృష్ణ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, ఉపాధ్యక్షులు బుడిగ మురళి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఖదీర్ బాబా, అన్ని గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News