Monday, September 16, 2024
HomeతెలంగాణGarla-నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం

Garla-నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం

ఎమ్మెల్యే కోరం కనకయ్య

అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గార్ల మండలంలోని మద్దివంచ అంజనాపురం గార్ల పాకాల ఏరు సమీపంలోని నీట మునిగి నష్టం వాటిల్లిన పంట పొలాలను శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

గ్రామాల వారీగా పంటలను కూలిపోయిన ఇండ్లకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి పంట నష్టం వివరాలను నమోదు చేసుకొని ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

అనంతరం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో 103 సంవత్సరాల శతాధిక వృద్ధురాలు మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు మండల వ్యవసాయ అధికారి రామారావు సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సిఐ రవికుమార్ ఎస్సై జీనత్ కుమార్ వివిధ అధికారులు రైతులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News