Saturday, April 12, 2025
HomeతెలంగాణGarla: గార్ల ఎంపీటీసీ భర్త మృతి

Garla: గార్ల ఎంపీటీసీ భర్త మృతి

నివాళి అర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

గార్ల మండల కేంద్రంలోని కొలిమి కొట్టం బజార్ కు చెందిన ఎంపీటీసీ పసుపులేటి సుజాత భర్త పసుపులేటి రామారావు (47) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. ఉదయం ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమద్యంలో రామారావు మృతిచెందాడు. మృతుడి భౌతికాయంను ఎమ్మెల్యే కోరం కనకయ్య, పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, ఎంపీపీ బట్టు నాగరాజు, జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీలక్ష్మి, గుండా వెంకట్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి రామారావు, ఎంపీటీసీ మాలోత్ వెంకట్ లాల్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్. భూక్యా నాగేశ్వరరావు, కట్టా శ్రీనివాస్, వీరేందర్. వీరయ్య తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఎల్లప్పుడు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News