Saturday, June 29, 2024
HomeతెలంగాణGarla: మాదకద్రవ్యాల నిర్మూలపై అవగాహన

Garla: మాదకద్రవ్యాల నిర్మూలపై అవగాహన

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని వాటికి దూరంగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు అన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన అక్రమ
రవాణా పై అవగాహన సదస్సు నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ యువత మత్తు చిత్తు ముసుగులో మునిగి తేలుతుందని, మత్తు పదార్థాలు అయినటువంటి గంజాయి, కొకైన్ , పొగాకు ఇటువంటి మందులు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని యువత ప్రధానంగా వీటికి దూరంగా ఉండాలని, తద్వారా మంచి సమాజం తయారవుతుందని తెలియజేశారు. ఈ మందులు నిరంతరం వాడటం వలన వ్యసనపరులుగా మారతారని, తద్వారా భవిష్యత్తు దెబ్బతింటుందని వీటికి విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అడపాల ప్రసాదరావు, కళాశాల అధ్యాపకులు ఈ డబ్ల్యూ ఆనంద్ కుమార్, జి రఘుబాబు , బి. జోగ్య , సత్యనారాయణ.సోమన్న, నాగేశ్వరరావు , జి రాంబాబు, శ్రీనివాస్ , సుజాత నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News