Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి

Garla: ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి

పెండింగ్ లో ఉపాధి హామీ కూలీలు..

పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, టి జి ఎస్ జిల్లా కార్యదర్శి భూక్య హరి నాయక్ లు డిమాండ్ చేశారు. మండలంలోని ముత్తితండా గ్రామంలోని బొడ్రాయి కుంట చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను వ్య.కా.స, తెలంగాణ గిరిజన సంఘం అధ్వర్యంలో పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే వరకు పనులు కల్పించాలని, పని ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డులకు ఆధార్ కార్డులకు లింక్ లేక అనేక మంది ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఆధార్ కార్డు ఆప్ డేట్స్ టెక్నికల్ సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని సుందరయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కూలీలు బిక్కు, వీరన్న, రామూర్తి, నీలా, వెంకన్న తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News