ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ లు అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక సాహకార ప్రాధమిక పరపతి సంఘంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కొమర్రాజు భద్రమ్మ ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆమెను పూలమాలతో సత్కరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. పిఎసిఎస్ సొసైటీలో అనేక సంవత్సరాలుగా సేవలందించిన ఆమె సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ పతంగి సత్యనారాయణ కడియం వెంకన్న ఆడెపు వెంకటేశ్వర్లు నాదెండ్ల రామారావు వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు గంగావత్ సునిత తదితరులు పాల్గొన్నారు.