Sunday, October 20, 2024
HomeతెలంగాణGarla: ఆర్టీసీ బస్టాండ్ లో ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్!

Garla: ఆర్టీసీ బస్టాండ్ లో ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్!

పార్కింగ్ లాట్ గా..

గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం ప్రైవేటు వాహనాలకు నిలయంగా మారింది. బస్టాండ్ ఆవరణంలో బైకులు కార్లు తదితర ప్రైవేట్ వాహనాల రాకపోకలు పార్కింగ్ నిషేధం ఉన్నప్పటికీ కొందరు తమ వాహనాలను అడ్డగోలుగా పార్కింగ్ చేయడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్టాండ్ ప్రాంగణాన్ని పార్కింగ్ అడ్డా చేసుకొని ఇష్టానుసారంగా ప్రతిరోజు తమ వాహనాలను నిలుపుతుండటంతో బస్సులు బస్టాండ్ లోకి వెళ్లడానికి అధిక సమయం పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

- Advertisement -

బస్టాండ్ ఆవరణంలో బస్సు తిరగే సందు లేకుండా ప్రైవేటు వాహనాలను నిలుపుదల చేయడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రైవేటు వాహనాలను అడ్డగోలుగా పార్కింగ్ చేస్తుండటంతో వర్షాకాలంలో ఆవరణం మొత్తం పెద్ద పెద్ద గుంటలతో బురదమయంగా మారి బస్సు ఎక్కడానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణంలో ప్రైవేటు వాహనాలను లేకుండా ఉండేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News