Friday, May 16, 2025
HomeతెలంగాణGarla: ఎస్సైకి రంజాన్ సేమియా ఇచ్చిన చిన్నారి

Garla: ఎస్సైకి రంజాన్ సేమియా ఇచ్చిన చిన్నారి

పవిత్రమైన రంజాన్ మాసంలో నెల రోజులపాటు కఠోరమైన ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించిన ఈద్-ఉల్-ఫితర్ వేడుకలలో భాగంగా గార్ల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీనత్ కుమార్ కు ఎండి నఫీజా రంజాన్ సేమియాను అందించింది. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమైన రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. చిన్నారి నఫీజాకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్ వేడుకలను జరుపుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News