రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలని టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు శీలంశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మండల కేంద్రంలో టి పి టి ఎఫ్ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన చేతుల మీదుగా ఆ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ లేకుండానే పదోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ టీచర్స్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విశ్రాంత టీచర్లకు బెన్ఫిట్ గ్రాండ్ వెంటనే విడుదల చేయాలని. మూతబడిన పాఠశాలలను తెరిపించాలని. విద్యార్థులకు సకాలంలో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు సరఫరా చేయాలన్నారు. బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు 30 శాతం కేటాయించి, విద్యాభివృద్ధికి మార్గం సుగమం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జి బాలాజీ నాయక్ రాములు నాయక్ సామా నాయక్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.