ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోతుందని మాజీ ఎంఈఓ గుడి రాంప్రసాద్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు యు డి వి ఎస్ రత్నకుమార్ పదవి విరమణ కార్యక్రమం మాచర్ల సుందర్ కుమార్ అధ్యక్షతన ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. యు డి వి ఎస్ రత్నకుమార్ ను ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పాఠశాలలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎంఈఓ రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, ఉద్యోగ నిర్వహణలో ఆయన చేసిన సేవలు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయన్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా కష్టతరంతో కూడుకుందని, విద్యార్థుల భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడంలో కీలకంగా ఉంటుందన్నారు.
ప్రతి ఉపాధ్యాయుడు పదవి విరమణ పొందినప్పటికీ తన అనుభవాలను పాఠశాలలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు శీలంశెట్టి వెంకటేశ్వర్లు శివ భాస్కర్ వెంకటేశ్వరరావు బాజీ రమేష్ వీరస్వామి ముల్కనూర్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాసులు గార్ల కాంప్లెక్స్ హెచ్ఎం పోట్ల నాగేశ్వరరావు పుల్లూరు హెచ్ఎం సురేష్ బాబు కస్తూర్బా ప్రత్యేక అధికారిని ఉష ఉపాధ్యాయులు వెంకటరెడ్డి సురేష్ రెడ్డి పి ఎన్ స్వామి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయినీలు మంజుల రజని రిటైర్డ్ టీచర్లు వజ్రం నాగేశ్వరరావు ఎడ్ల అప్పయ్య పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.