గార్ల మండల కేంద్రంలో స్థానిక తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద విశ్వ సమాజం పోస్టర్ ను బహుజన సాహిత్య వేదిక జిల్లా అధ్యక్షులు వజ్రం నాగేశ్వర రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి మానసిక భావనలో, దైనందిన జీవితంలో ప్రకృతి ఆధారంగా మార్పు రావాలన్నారు. అమానవీయ విలువలతో కూడిన మానవ జీవన సంస్కృతి, నాగరికతలను భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం అనే పంచ భూతాల సైద్ధాంతిక అవగాహనతో మానవీకరించడం కోసం విశ్వ సమాజం ఆవిర్భవిస్తుందన్నారు.
వరంగల్ లో జూన్ 30న నిర్వహించనున్న విశ్వ సమాజం ఆవిర్భావ సభలో ముఖ్యఅతిథిగా ప్రజా కవి జయరాజు, ప్రధాన వక్తగా కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీ నరసయ్య పాల్గొననున్నారన్నారు.
ఈనెల 30న జరగానున్న విశ్వ సమాజం ఆవిర్భావ సభలో ప్రకృతి వాదులు, ప్రజాస్వామ్యవాదులు కౌలు కళాకారులు మేధావులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వ సమాజం వ్యవస్థాపకులు విశ్వ జంపాల, వివిధ పార్టీల, సంఘాల నాయకులు గుండా వెంకట రెడ్డి షేక్ జానీ, పిల్లలమర్రి వీరాస్వామి, జానిమియా, ముంగి రాములు, కాముని శ్రీనివాస్, యాకూబ్ పాష బోడా అశోక్, వెల్డింగ్ పాష, బొడ్డు నరసంహా రావు, అన్నం శ్రీనివాస రావు,సర్వర్ తదితరులు పాల్గొన్నారు