Sunday, November 16, 2025
HomeతెలంగాణGHMC Council Meeting: గ్రేటర్ కౌన్సిల్ సమావేశం రసాభాస.. భిక్షాటన చేసిన బీజేపీ కార్పొరేటర్లు

GHMC Council Meeting: గ్రేటర్ కౌన్సిల్ సమావేశం రసాభాస.. భిక్షాటన చేసిన బీజేపీ కార్పొరేటర్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం(GHMC Council Meeting)లో గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం సమావేశం ప్రారంభం కాగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాకు కౌన్సిల్ నివాళులు అర్పించింది. అనంతరం జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ పెట్టేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మీ సిద్ధం కాగా.. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలంటూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ గందరగోళం మధ్యనే రూ.8,440కోట్లతో మేయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

- Advertisement -

కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టగా.. వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకొని ప్లకార్డులను చించివేశారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో చర్చ లేకుండానే.. బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సమావేశం దృష్ట్యా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ బీజేపీ కార్పొరేటర్లు బిక్షాటన చేసుకుంటూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. మొత్తానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad