జీహెచ్ఎంసీ(GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నెల 10 నుంచి 17వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 18న నామినేషన్లు పరిశీలన చేయనున్నారు. 21 తేదీ వరకు నామినేషన్లు ఉప సంహరణకు అవకాశం ఉంది. ఇక 25వ తేదీన జీహెచ్ఎంసీ కార్యాలయంలో పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు.
- Advertisement -
15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు కార్పొరేటర్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఉన్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఆసక్తిగతా మారింది.