రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ ఆదేశాలతో అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్ యజమానులు ఐకెపి సెంటర్లో తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా వచ్చినప్పటికీ కూడా లేని సమస్యను సృష్టించి బస్తాకు రెండు కిలోల చొప్పున కోతకు అంగీకరిస్తేనే మిల్లర్ కి వచ్చిన లారీలను అన్లోడ్ చేసి పంపిస్తామని లేని ఎడల అలాగే పెండింగ్లో పెడతామని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది చేస్తున్న రైస్ మిల్లర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేసారు. అదేవిధంగా ఫోన్ ద్వారా అడిషనల్ కలెక్టర్ శ్యాంలాల్ విషయాన్ని వివరించామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తెలియజేశారు తడిసిన ప్రతి గింజను కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని ప్రతిష్టాత్మకంగా 90% కొనుగోలు పూర్తయినప్పటికీ ఒక 10% కొనుగోలు విషయంలో ఇలాంటి కోతలు పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే సంబంధిత రైస్ మిల్లర్ యజమానులపై చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశిస్తామన్నారు.
ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా పౌరసరఫరాల అధికారి ఫోన్ ద్వారా సంబంధిత యజమానులకు ఫోన్ చేసి గట్టిగా హెచ్చరించడంతో వెంటనే లారీల అన్లోడ్ చేసుకుంటామని హామీ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు పెద్దంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్ పెద్దపేట గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షులు పల్లె రవీందర్ పెద్దంపేట్ గ్రామ రైతులు విజయేందర్ రెడ్డి వేముల విజయ్ పెండ్యాల వెంకటేష్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.