అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ లీగ్ వ్యవస్థాపకులు కొమ్ము రమేష్ , ప్రణీత్ ఆధ్వర్యంలో 133వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ మాట్లాడుతూ… కుల వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాధికారమే లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకుని బహుజనులందరూ బాగుపడాలని అప్పుడే వారి ఆశ సాధించినట్లు అవుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ… నీకోసం నువ్వు బ్రతుకుతే స్వార్థం అవుతుంది. సమాజం కోసం బ్రతికితే చరిత్ర పుటల్లో నిలుస్తామని చెప్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన సూక్తి ఈరోజు నిజమైంది. 133 సంవత్సరాల క్రితం పుట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజం కోసం దళిత బహుజన కోసం చేసినటువంటి సేవలతోనే మహానీయుడుగా బహుజనుల బాంధవుడిగా బహుజనుల ఆరాధ్య దైవంగా నిలబడ్డాడనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, కొమ్ము రమేష్ యాదవ్ ఆర్.ఎస్.ఐ ప్రణీత్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్,మాజీ సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ గురువయ్య, మాజీ సర్పంచ్ ఆముల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ మార్తా రాధమ్మ, రాములు,ఆదివాసి గిరిజన నాయకులు ఊరేటి మహేష్, పటాని మహేష్, ముదిరాజ్ సంఘం నాయకులు బోయబోతు మల్లేష్, మాజీ వార్డు సభ్యులు బండి మహేష్ గౌడ్, పి.వై.ఎల్.జిల్లా అధ్యక్షులు పెండ్యాల రమేష్, యాదవ సంఘం నాయకులు గంగయ్య, రాజేశం, మల్లయ్య, ఆముల శరన్, బీరెల్లి ప్రశాంత్ ,తమ్మనవేని కోటి, వేల్పుల కుమార్ యాదవ్, లైసెెట్టి రవి, కాంపల్లి శంకర్, తమ్మనవేని కోమల, అంజలి, పద్మ, పెండ్యాల వెంకటేష్, ఊరేటి సురేష్, రాకేష్, స్వామి, సాగర్ యాదవ్ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Godavarikhani: అంబేద్కర్ ఆశయం కోసం పనిచేయాలి
సమాజం కోసం బ్రతికితే చరిత్ర పుటల్లో